మెగాస్టార్ మూవీలో మీనాక్షి స్పెషల్ రోల్
Actor ProfileActor

మెగాస్టార్ మూవీలో మీనాక్షి స్పెషల్ రోల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెగాస్టార్ మూవీలో మీనాక్షి స్పెషల్ రోల్
Chitrajyothy26 Nov 2026
మెగాస్టార్ మూవీలో మీనాక్షి స్పెషల్ రోల్

మీనాక్షి చౌదరి సంక్రాంతి సెంటిమెంట్‌ ఇంకా కొనసాగుతోంది. వచ్చే యేడాది పొంగల్ సీజన్ లోనూ మీనాక్షి సినిమా రాబోతోంది. ఆమె చిరంజీవి - బాబీ మూవీలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మీనాక్షి చౌదరికి, సంక్రాంతి సీజన్ కు ఓ అవినాభావ సంబంధం ఉంది. గత మూడేళ్ళుగా ఆమె నటించిన సినిమాలు సంక్రాంతి సీజన్ లో జనం ముందుకొచ్చి విజయాన్ని పొందుతున్నాయి. 2024లో 'గుంటూరు కారం'తో ఈ సెంటిమెంట్‌ మొదలైంది. అందులో హీరోయిన్ శ్రీలీలే అయినా... మీనాక్షి చౌదరి... మహేశ్ బాబు అత్త కూతురుగా నటించింది. ఆ తర్వాత సంవత్సరం 'సంక్రాంతికి వస్తున్నాం, ఈ యేడాది 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి సీజన్ లోనే వచ్చాయి. ఇక వచ్చే సంక్రాంతి సీజన్ ను మీనాక్షి చౌదరి మిస్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి 2021లో సుశాంత్‌ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అదే అక్కినేని కాంపౌండ్‌లోని నాగ చైతన్య సరసన 'వృషకర్మ'లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఇదే యేడాది జనం ముందుకు రాబోతోంది. సో... మీనాక్షి సంక్రాంతి కోరిక ఎలా నెరవేరుతుందనే సందేహం రావచ్చు. దానికి మెగాస్టార్ మూవీతో సమాధానం చెప్పబోతోంది మీనాక్షి చౌదరి. మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెకండ్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇది 2027 సంక్రాంతికి వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఓ స్పెషల్ రోల్ చేయబోతోందట. ఇందులో చిరంజీవి సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో మాఫియా డాన్ గా కనిపించబోతున్నారని సమాచారం. ఓ డిఫరెంట్ లుక్ ను చిరంజీవి కోసం ట్రై చేస్తున్నారని, అది సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను వెంకట్ నారాయణ భారీగా

మ గ స ట ర మ వ ల మ న క ష స ప షల ర ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in