మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర
Actor ProfileActor

మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర
Samayam Telugu30 Nov 2026
మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి 'మెగా 158'లో కీలక పాత్ర

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి ఖాతాలో మరో అరుదైన అవకాశం చేరినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి సీజన్లో వరుస సక్సెస్‌లు అందుకోవడంతో పాటు స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకుంటున్న ఈ అందాల తార తాజాగా మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రంలో భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.* కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.. 'ఇంద్రపుత్ర'తో పాన్ ఇండియా మైథలాజికల్ ధమాకాకేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ' మెగా 158 'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండటంతో ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో మీనాక్షి చౌదరి ఓ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకంగా ఉండే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె పాత్ర రానుందని తెలుస్తోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, విభిన్నమైన వేరియేషన్స్‌తో సాగే ఈ ఫ్లాష్‌బ్యాక్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.2018లో ‘ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్’ రన్నరప్గా నిలిచి గుర్తింపు పొందిన మీనాక్షి, గ్లామర్ రంగం నుంచి నటన వైపు అడుగులు వేశారు. 'అవుట్ ఆఫ్ లవ్' అనే హిందీ వెబ్ సిరీస్‌తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె, 2021లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత రవితేజ సరసన 'ఖిలాడి', అడవి శేష్తో 'హిట్: ది సెకండ్ కేస్', మహేష్‌బాబుతో ‘గుంటూరు కారం’, వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’, దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' వంటి వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలను సాధించారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ చిత్రంలో మీనూ హీరోయిన్‌గా నటిస్తోంది.* కొడుక్కి రామ్‌చరణ్’ పేరు... అభిమాని ప్రేమకు చలించిపోయిన చిరంజీవి, ఊహించని సర్‌ప్రైజ్చిరంజీవి-బాబీ చిత్రాన్ని

మ గ ఆఫర క ట ట స న మ న క ష చ దర చ ర జ వ మ గ 158 ల క లక ప త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in