మూగబోయిన జిలిబిలి పలుకుల మైనా.. గాయనిగా జానకి స్పెషాలిటీ అదే
Actor ProfilePolitician

మూగబోయిన జిలిబిలి పలుకుల మైనా.. గాయనిగా జానకి స్పెషాలిటీ అదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూగబోయిన జిలిబిలి పలుకుల మైనా.. గాయనిగా జానకి స్పెషాలిటీ అదే
Zee Telugu30 Oct 2026
మూగబోయిన జిలిబిలి పలుకుల మైనా.. గాయనిగా జానకి స్పెషాలిటీ అదే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Singer S Janaki Life Story: ఎస్. జానకి స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం మృధు మధురం. తన పాటలతో ప్రేక్షకుల మనసులను ‘నీలి మేఘాలలో’ తేలిపోయేలా చేసింది. తన సుస్వరాలతో ‘పగలే వెన్నెలను’ పూయించింది. పాటల పూదోటలో తన గానామృతంతో మధురిమలు పంచిన మైనా. ‘గున్న మామిడి కొమ్మ’ మీదీ పలుకులతో వెండితెరకు వసంతాన్ని తీసుకొచ్చిన గాన కోకిల. పక్షుల కిలకిల రావాలైనా...పసిపాపల స్వరాలైనా...అమ్మ పలికే లాలిపాటలైనా... ఆమె గొంతులో సరాగాలవుతాయి. తన గానంతో దుర్యోధన దుశ్శాసన దుర్వినీతిని ఎండగట్టినా... సిరిమల్లే పువ్వా..అంటూ హస్కి వాయిస్ తో ప్రేక్షకులకు తీపి గాయాలను చేసినా జానకమ్మకే చెల్లింది. ఈ విధంగా స్వరాలతో చేయగలిగినన్ని ప్రయోగాలు చేయడంలో ఎస్.జానకి ఎప్పుడూ ముందుంటుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ,తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మనీ, ఇంగ్లీషు భాషల్లో వేలాది పాటలు పాడిన జానకమ్మ ....1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించింది. పుడుతునే మాటల కంటే పాటలను నేర్చిందీ గాన కోకిల. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. చిన్నతనంలో కూతురు సంగీతాభిలాష గమనించి ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడిస్వామి దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. అప్పటి నుంచి తన పదోయేట వరకూ వివిధ సంగీత కచేరీల్లో పాడి పేరు తెచ్చుకుందీ జానకి. 18వ యేట వచ్చే సరికి.. జాతీయ స్థాయిలో సంగీత పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది

మ గబ య న జ ల బ ల పల క ల మ న గ యన గ జ నక స ప ష ల ట అద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in