ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగత ఫ్లెక్సీలో జగన్ ఫోటో
Actor ProfilePolitician

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగత ఫ్లెక్సీలో జగన్ ఫోటో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగత ఫ్లెక్సీలో జగన్ ఫోటో
Samayam Telugu24 Oct 2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగత ఫ్లెక్సీలో జగన్ ఫోటో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చింతకాని మండలం జగన్నాధపురంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రైతు ఆశీర్వాద సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఏర్పాటుచేసిన స్వాగత ఫ్లెక్సీలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. మత్కేపల్లి క్రాస్ వద్ద ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. స్థానిక కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటుచేసినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫోటో పక్కన.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోను పెద్దగానే ముద్రించారు. ప్రస్తుతం ఇది ఖమ్మం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి స్వాగత ఫ్లెక్సీలు పెట్టడం గమనార్హం. మధ్యలో రేవంత్ రెడ్డి ఫోటో.. పైన ఎన్టీఆర్, ఆ పక్కన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఫోటోతో కూడిన ప్రత్యేక స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో స్వాగత బ్యానర్లపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు కనిపించడం రాజకీయ చర్చకు దారితీసింది.ఇదిలా ఉండగా, ఖమ్మం సభలో తుది విడత రైతు భరోసా నిధులను సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అలాగే, ఈ-పట్టాదారు పాసు పుస్తకాలను కూడా పలువురికి అందజేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌)పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పదేళ్లపాటు వారి రాక్షస పాలన సాగిందని, రైతులకు బేడీలు వేశారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో తెలంగాణలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని సీఎం జోస్యం చెప్పారు. అంతేకాదు, డిసెంబరు 2028లో అసెంబ్లీ