మాకు సమస్య వస్తే అన్నయ్య నిలబడతాడు.. చిన్నప్పుడు అన్నయ్య వరుణ్ ని.. నాగబాబు
Actor ProfileCelebrity

మాకు సమస్య వస్తే అన్నయ్య నిలబడతాడు.. చిన్నప్పుడు అన్నయ్య వరుణ్ ని.. నాగబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మాకు సమస్య వస్తే అన్నయ్య నిలబడతాడు.. చిన్నప్పుడు అన్నయ్య వరుణ్ ని.. నాగబాబు కామెంట్స్
10TV Telugu5 Dec 2026
మాకు సమస్య వస్తే అన్నయ్య నిలబడతాడు.. చిన్నప్పుడు అన్నయ్య వరుణ్ ని.. నాగబాబు కామెంట్స్

Nagababu : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి నాగబాబు కూడా వచ్చారు. నాగబాబు ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. మేము ఎవరమైనా సరే ఇవాళ ఇక్కడ స్టేజిపై ఇలా ఉన్నామంటే కారణం అన్నయ్య. మా అందరికి ప్రాణవాయువు లాంటి వాడు అన్నయ్య. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ కానీ, చరణ్, వరుణ్, తేజ్, వైష్ణవ్.. ఇలా ఎంతమంది ఉన్నా మా అన్నయ్య లాంటి వ్యక్తి ఆశీర్వాదం, ఆయన బలం మా వెనక ఉన్నప్పుడు ఇది సాధ్యమైంది. ఆయనకు మేము ఏమి తిరిగి చేయలేము. ఆయనే మాకు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నాకంటే ఎక్కువగా వరుణ్ ని ఎత్తుకున్నది అన్నయ్యే. అన్నయ్య అప్పుడు చేసిన సినిమా ప్రివ్యూలకు వరుణ్ ని తీసుకెళ్లేవారు. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, వరుణ్ తక్కువ మాట్లాడినా వరుణ్ – అన్నయ్య చాలా మాట్లాడుకుంటారు. సినిమా మేకింగ్ గురించి మాట్లాడుకుంటారు. అన్నయ్య వరుణ్ ని బాగా చూసుకుంటాడు. అన్నయ్య అందర్నీ ఒకేలా చూస్తాడు. ఇవాళ్టికి కూడా మాకు ఒక సమస్య వస్తే మా కోసం నిలబడతాడు. లవ్ యు అన్నయ్య. మా అన్న ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ బలం మాకు ఉన్నంత కాలం ఇండస్ట్రీలో మేము సక్సెస్ సాధిస్తామని నమ్మకం ఉంది అని అన్నారు