అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లెనిన్’. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ఆదివారం తిరుపతిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. రెండున్నరేళ్లుగా అభిమానులకు తన మొహం చూపించలేకపోతున్నానని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ.. ''గ్యాప్ వచ్చింది.. అందుకు మొన్న వైజాగ్ ఈవెంట్ లో సారీ చెప్పాను. మళ్లీ ఇవాళ కూడా సారీ చెప్తున్నా. నా మనసులో ఎంతో బాధగా ఉంది. రెండున్నరేళ్లుగా మీతో సంప్రదించలేకపోతున్నా. నా మొహం చూపించలేకపోతున్నా. అది నేను ఫ్రాంక్ గా ఒప్పుకోవాలి. ఈరోజు ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చాను. దానికి కారణం 'లెనిన్' సినిమా. 'నేను కొత్తగా కనిపించాలి.. బాగా చేయాలి' అని చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఈసారి నేను మీ ఇంటివాడిని అయిపోవాలి అనేదే 'లెనిన్' వెనుక నా ఉద్దేశ్యం. మీరు నన్ను ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్తారో అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఆ ప్రయత్నమే ఈ 'లెనిన్'' అని అన్నారు.''రెండేళ్ల క్రితం ఈ సీమ బిడ్డ నందు మురళీ కిశోర్ ను కలిశాను. నాకు ఒక అద్భుతమైన కథ చెప్పాడు. విన్న వెంటనే ఒక హగ్ ఇచ్చి 'ప్లీజ్, ఇంకెవరితో ఈ స్టోరీ చేయకు. ఇది నా కథ. ఎక్కడో నాకోసమే రాశావు' అని అన్నాను. నా మైండ్ లో రన్ అవుతున్న బాధ, నా జర్నీ అంతా ఆ కథలో కనిపించాయి.. వినిపించాయి. వెంటనే చేయాలని అనిపించింది. నాగవంశీ ఈ సినిమా నాతో చేయాలని అనుకున్నాడు. మా ఇద్దరి మధ్య పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. కలిసి ఒక గొప్ప సినిమా చేద్దాం బ్రదర్ అని వంశీని నాన్నగారి దగ్గరకు తీసుకెళ్లాను. హిట్టు
Actor ProfileActor
మీకు నా మొహం చూపించలేకపోతున్నా.. మనసులో ఎంతో బాధగా ఉంది’.. అఖిల్ ఎమోషనల్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•23 Sept 2026
మీకు నా మొహం చూపించలేకపోతున్నా.. మనసులో ఎంతో బాధగా ఉంది’.. అఖిల్ ఎమోషనల్