మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడు
Actor ProfileActor

మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడు
TV9 Telugu31 Oct 2026
మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడు

తెలుగు చిత్రసీమలో సహజనటిగా పేరుగాంచిన జయసుధ సినీ ప్రస్థానం వెనుక ఎన్నో ఆసక్తికరమైన, అరుదైన విషయాలు దాగి ఉన్నాయి. చిన్నతనం నుంచే సినిమాల పట్ల అయిష్టతను ప్రదర్శించిన ఆమె, ఒక జ్యోతిష్యుడి జోస్యం, కుటుంబ నేపథ్యం, అనుకోని పరిణామాల వల్ల చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, అగ్రతారగా ఎదగడం విశేషం. జయసుధ తల్లిదండ్రులు రమేష్, జోగాబాయి. జోగాబాయి తండ్రి నిడదవోలు వెంకట్రావు గొప్ప పండితులు. జోగాబాయికి లలిత కళలంటే చిన్నతనం నుంచే ఆసక్తి ఎక్కువ. బడిలో చదువుకుంటూనే ఆల్ ఇండియా రేడియో బాలల కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ రోజుల్లోనే దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కేఎస్ ప్రకాష్ రావు నిర్మించిన బాలానందం చిత్రంలోని కొంటె కృష్ణయ్యలో జోగాబాయి నటించారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెద్దమనుషులు చిత్రంలో ఒక పాట కూడా పాడారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తండ్రి ప్రకాష్ రావు దర్శకత్వంలో జోగాబాయి నటించగా, కొడుకు రాఘవేంద్రరావు దర్శకత్వంలో జయసుధ నటించి చక్కని పేరు తెచ్చుకున్నారు. జయసుధ తండ్రి రమేష్ ఆ రోజుల్లో మద్రాస్ కార్పొరేషన్‌లో పనిచేస్తూనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాంటీన్‌లు నిర్వహించేవారు. ఆయన ఆంధ్ర విజ్ఞాన సభ పేరుతో నాటక సంస్థను నడిపేవారు. రమేష్, జోగాబాయిల పరిచయం ప్రేమగా మారి, ఫిబ్రవరి 2, 1956న వారి వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే వీరికి ఓ కొడుకు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత డిసెంబర్ 12, 1958న సుజాత (జయసుధ అసలు పేరు) జన్మించారు. ఆమె తర్వాత సుభాషిని, మనోహర్, వెంకటేష్ అనే సోదరులు పుట్టారు. కొడుకు పోవడంతో జయసుధను తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా పెంచారు. జయసుధను ఐదో ఏట ట్రిప్లికేన్‌లో ఓ కాన్వెంట్‌లో చేర్పించారు. మొదట్లో స్కూల్‌కి వెళ్ళనని మారాం చేసినా, తర్వాత చదువుపై శ్రద్ధ పెరిగింది. జోగాబాయికి సినిమాలంటే పిచ్చి. తరచూ సినిమాలు చూడాల్సిందే. అయితే సుజాతకు సినిమాలంటే ఆసక్తి ఉండేది కాదు. నేను రాను మమ్మీ, మూడు గంటల సేపు తలుపులు

మ క త ల యన జయస ధ చ న న వయస స ల ఆమ వ భ గ న న చ ప ప స న జ య త ష య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in