
దిల్లీ: నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న ఆమె ఫ్యాన్ క్లబ్‌లు, అభిమానుల పేజీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. జాన్వీపై (Janhvi Kapoor) అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలతో పాటు, డీప్‌ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి అశ్లీల కంటెంట్ తయారు చేస్తున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటికి సంబంధించిన కొన్ని ఫ్యాన్ పేజీ లింక్‌లతో పాటు 4000 వెబ్‌సైట్ లింక్‌లను కూడా కోర్టుకు సమర్పించారు. దీనిపై దిల్లీ హైకోర్టులో (Delhi High Court) విచారణ జరిగింది. విమర్శలు, ఆన్‌లైన్ దూషణలు ప్రజా జీవితంలో భాగమైపోయాయని పేర్కొంటూ .. ఆమెకు సంబంధించిన అన్ని అభిమాన సంఘాలపై నిషేధం విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ‘‘అశ్లీలత, తీవ్రమైన అభ్యంతరకర కంటెంట్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ అన్ని ఫ్యాన్ క్లబ్‌లను ఎలా మూసివేయగలం?’’ అని ప్రశ్నించింది. అన్ని ఫ్యాన్ పేజీలు తప్పుగా ప్రవర్తించడం లేదని, కొన్ని కేవలం అభిమానంతోనే క్రియేట్ చేసి ఉండొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ‘మీకు అభిమానులు వద్దా?’ అని ప్రశ్నించిన కోర్టు.. ఫ్యాన్ పేజీలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. దర్శకుడు వెంకీ అట్లూరీ.. నటుడు సూర్య (Suriya) పాదాలకు నమస్కరించారు. బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న చిత్రం ‘హైవాన్’