మీ ఐటీ రిటర్న్స్ ఎవరితో ఫైల్ చేయించాలి?
Actor ProfilePolitician

మీ ఐటీ రిటర్న్స్ ఎవరితో ఫైల్ చేయించాలి?

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మీ ఐటీ రిటర్న్స్ ఎవరితో ఫైల్ చేయించాలి? , , ల మధ్య తేడా ఏంటో తెలుసుకోండి
Samayam Telugu19 Sept 2026
మీ ఐటీ రిటర్న్స్ ఎవరితో ఫైల్ చేయించాలి? , , ల మధ్య తేడా ఏంటో తెలుసుకోండి

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయడం అనేది ప్రతి ఒక్కరికీ సులభం కాకపోవచ్చు. సంక్లిష్టమైన లావాదేవీలు ఉన్నప్పుడు పొరపాట్లు, తప్పులు జరగకుండా నిపుణుల సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ దీని కోసం ఇ-ఫైలింగ్ ఫోర్టల్‌లో మూడు కేటగిరీల వారికి అవకాశాలు ఇచ్చింది. చార్టర్డ్ అకౌంటెంట్లు, ఈ-రిటర్న్ ఇంటర్మీడియరీస్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మరి ముగ్గురిలో ఎవరితో రిటర్న్స్ ఫైల్ చేయించాలి, ఈ ముగ్గురి మధ్య తేడా ఏంటి? అనే వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ట్యాక్స్ పేయర్లు తమ అవసరాలకు తగినట్లుగా విభిన్న కేటగిరీల ప్రతినిధులను అపాయింట్ చేసేందుకు ఇ-ఫైలింగ్ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. ఇందులో సీఏలు, ఈఆర్ఐ‌లు, అధికారిక ప్రతినిధులు ఉంటారు. వీరి మధ్య స్పష్టమైన తేడాలు, బాధ్యతలు ఉన్నాయి. తాము ఏ ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాం, మన ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎన్ని విధాలుగా ఆదాయాలు వస్తున్నాయి అనే వివరాల ప్రకారం ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. చార్టర్డ్ అకౌంటెంట్లు (CA)చార్టర్డ్ అకౌంటెంట్లు ట్యాక్స్ రూల్స్ నిపుణులు. ఫైలింగ్ పోర్టల్‌లో మై సీఏ ద్వారా యాడ్ చేసుకోవాలి. నోటీసులకు రిప్లై ఇవ్వడం, బిజినెస్ ఆడిటింగ్, ఫారమ్‌ల వెరిఫికేషన్‌కు వీరు సరైన ఎంపికగా చెప్పవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సభ్యులుగా ఉంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్, అకౌంటింగ్ సర్వీసులు అందిస్తారు. ఒకసారి వారికి అథారితీ ఇస్తే చట్టపరమైన ఫామ్స్ ఫైలింగ్, ఇ-వెరిఫై, ఫామ్ 15సీబీ పెద్దమొత్తంలో అప్లోడ్ చేయడం, సబ్మిట్ చేసిన ఫామ్స్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ రిజిస్టర్, సమస్యల పరిష్కారం వంటి వాటికి సహాయం చేస్తారు. ఇ-రిటర్న్ ఇంటర్మీడియెట్స్ (ERIs)ట్యాక్స్ ఫైలింగ్ సర్వీసులు అందించేందుకు ఆదాయపు పన్ను విభాగం నుంచి అనుమతి పొందిన సంస్థలను ఇ-రిటర్న్ ఇంటర్మీడియెట్స్ అంటారు. వారికి ఉన్న అథారిటీ ప్రకారం ఈఆర్ఐలు డిపార్ట్‌మెంట్ యుటిలిటీలను ఉపయోగిస్తారు. ఐటీ శాఖ ద్వారా గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ