ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటుంటారు.. చాలా పెద్ద స్థాయిలో, మంచి పొజిషన్‌లో సెటిలయిన వాళ్లు పండగకో, పబ్బానికో సొంత ఊరు వస్తుంటారు. అప్పుడు తాము పెరిగిన ఊరు ఇంకా ఇలానే ఉందేంటి.. ఎలాగైనా డెవలప్ చేయాలి అన్న ఆలోచన చాలా మందిలో వస్తుంది. తమ వంతు సాయంగా ఏదోకటి చేయాలి అనిపిస్తుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మీ గ్రామానికి ఎంతోకొంత తిరిగి అందించండి అంటూ ఆహ్వానం పలుకుతుంది. ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయొచ్చు.ఈ కాన్సెప్ట్ వింటే శ్రీమంతుడు సినిమానే గుర్తొస్తుంది కదా. కరెక్టే.. ఆ సినిమాలో హీరో చేసిన విధంగా మనం పుట్టిన నేల కోసం ఎంతో కొంత చేస్తే మన కళ్ల ముందే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన దాన్‌వీర్ ద్వారా మీ గ్రామాన్ని డిజిటలైజే చేసుకునే అవకాశం ఉంది.READ ALSO ఇలాంటి ద్రౌపదీ దేవి ఆలయం గురించి ఎక్కడా వినుండరు.. దక్షిణ భారతంలోనే ఏకైక గుడి, తెలుసుకోండి!భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ వినూత్నమైన, పారదర్శకమైన దాన్‌వీర్ కార్యక్రమం ద్వారా పౌరులు, సంస్థలు, దాతృత్వ సంస్థలు నేరుగా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు అందించేందుకు వీలు కల్పించారు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద తమ సొంత గ్రామానికి పౌరులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారు గ్రామ పంచాయతీల్లో డిజిటల్ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు తమవంతు సహకారం అందించవచ్చు.మేరీ పంచాయత్ యాప్ ద్వారా గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా కంప్యూటర్లు అందించవచ్చు. పంచాయతీ నమోదు, సహకారం అందించడం నుంచి కంప్యూటర్ల ఏర్పాటు, వినియోగం వరకు మొత్తం ప్రక్రియను డిజిటల్‌గా ట్రాక్ చేయవచ్చు. ప్రజల భాగస్వామ్యం, సాంకేతికత, పారదర్శకతను కలుపుతూ దాన్‌వీర్ గ్రామ
Actor ProfilePolitician
మీ ఊరికి మీరే శ్రీమంతులు.. దాన్ వీర్ గా మారండీ తిరిగి ఇచ్చేసేయండీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Dec 2026
మీ ఊరికి మీరే శ్రీమంతులు.. దాన్ వీర్ గా మారండీ తిరిగి ఇచ్చేసేయండీ