
Maa Inti Bangaram : సమంత ఇటీవల మా ఇంటి బంగారం అనే సినిమాతో వచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది రొటీన్ కథ, కథనం అయినా, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అంత ఎఫెక్ట్ గా లేకపోయినా కాస్త ఎంటర్టైన్మెంట్, సమంత యాక్షన్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది ఈ సినిమా. ముఖ్యంగా మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతోమంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సమంతనే నిర్మాత కావడం, చాలా ఏరియాలలో తనే సొంతంగా రిలీజ్ చేయడం, తన మనుషులతో రిలీజ్ చేయించడంతో ప్రాఫిట్స్ బాగానే వచ్చాయి. ఈ సినిమాకు దాదాపు సమంతకు 20 కోట్ల వరకు లాభం వచ్చిందని టాలీవుడ్ టాక్. అయితే మన టాలీవుడ్ లో ఇటీవల అన్ని సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజు, ఇంకొంతమంది చిన్న నిర్మాతలు ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. అలా సమంత మా ఇంటి బంగారం సినిమాకు కూడా దాదాపు 15 నుంచి 20 కోట్లు పెంచి ఫేక్ పోస్టర్స్ వేస్తున్నారు అని సమాచారం. తాజాగా మా ఇంటి బంగారం సినిమాకు ఏకంగా 96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని పోస్టర్ వేశారు. రేపో ఎల్లుండో వంద కోట్ల పోస్టర్ కూడా వేస్తారు. ఈ సినిమాకు సోషల్ మీడియాలో కూడా బాగా ప్రమోట్ చేయించారు. తెలుగులో అత్యధికంగా కలెక్ట్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ సినిమాని అరుంధతితో పోలుస్తున్నారు. అరుంధతి సినిమా 2009 లో రిలీజయి అప్పటి 10, 20, 50 రూపాయల టికెట్ రేట్లతోనే దాదాపు 70 కోట్లవరకు కలెక్ట్ చేసింది. ఇప్పటికి ఆ సినిమానే అత్యధికంగా కలెక్ట్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా తెలుగులో. ఆ సినిమాని కంపేర్ చేస్తూ మా ఇంటి బంగారం, సమంత