మహేష్ మ్యూజికల్ హిట్ బాబి రీరిలీజ్ ఎప్పుడంటే
Actor ProfileActor

మహేష్ మ్యూజికల్ హిట్ బాబి రీరిలీజ్ ఎప్పుడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహేష్ మ్యూజికల్ హిట్ బాబి రీరిలీజ్ ఎప్పుడంటే
123Telugu21 Nov 2026
మహేష్ మ్యూజికల్ హిట్ బాబి రీరిలీజ్ ఎప్పుడంటే

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజుకి మహేష్ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘దూకుడు’ రీరిలీజ్ కి వచ్చింది. అయితే ఈ రీరిలీజ్ ట్రెండ్ ని తీసుకొచ్చిన మహేష్ అభిమానులని మహేష్ వింటేజ్ చిత్రాల్లో ఒకటైన బాబీ ఇప్పుడు రీరిలీజ్ కి సిద్ధం అయ్యింది. నేడు మహేష్ పుట్టినరోజు కానుకగా ఈ అనౌన్సమెంట్ వచ్చింది. 2002 లో మహేష్ బాబు ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది నవంబర్ రీరిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రోమియో జూలియట్ ప్రేమ కథ తరహాలో ట్రాజెడీ లవ్ స్టోరీగా తెరకెక్కి మహేష్ బాబు అభిమానులకు ఓ చక్కటి అనుభూతిని మిగిల్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇప్పటికీ మహేష్ ఫ్యాన్స్ ప్లే లిస్ట్ లో ఉంటుంది. అటువంటి హిట్ చిత్రం మళ్ళీ నవంబర్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని పివి ఫిలిమ్స్ బ్యానర్ పై రీ రిలీజ్ చేస్తున్నారు

మహ ష మ య జ కల హ ట బ బ ర ర ల జ ఎప ప డ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in