మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి
Actor ProfileActor

మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి
Zee Telugu5 Nov 2026
మహేశ్ బాబు రాముడు.. ఎన్టీఆర్ రావణుడు.. రామాయణ ట్రైలర్ చూసేయండి

Ramayana Trailer:రామాయణం సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ట్రైలర్ విడుదలకు ఇంకా సమయం ఉండటంతో, సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ మేడ్ ఏఐ ట్రైలర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన ఈ వీడియోలో తెలుగు స్టార్ హీరోలను రామాయణ పాత్రల్లో చూపించారు. ఇందులో రాముడి పాత్రలో మహేశ్ బాబు, రావణుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడం అభిమానులను ఉత్సాహపరుస్తోంది. అలాగే సీతగా కీర్తి సురేష్, మండోదరిగా జాన్వీ కపూర్‌ను చూపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సుమారు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా సీత అపహరణ తర్వాత రాముడిగా మహేశ్ బాబు చూపించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు రావణుడిగా ఎన్టీఆర్ కనిపించిన సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీశాయి. ఆయన తపస్సు చేస్తున్నట్లు చూపించిన షాట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించిందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో విడుదలైన కొద్ది సమయంలోనే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో వేగంగా వైరల్ అయింది. పలువురు అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇలాంటి కాంబినేషన్‌తో నిజంగానే సినిమా వస్తే చూడాలని ఉందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఈ ఏఐ వీడియోను రూపొందించిన వారికి ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అభిమానులు రూపొందించిన ఫ్యాన్ మేడ్ ఏఐ వీడియో మాత్రమే. దీనికి అధికారిక రామాయణ సినిమాతో ఎలాంటి సంబంధం లేదు. అసలు చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీతాన్ని హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. రామాయణం మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల

మహ శ బ బ ర మ డ ఎన ట ఆర ర వణ డ ర మ యణ ట ర లర చ స య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in