
తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి, గానకోకిల ఎస్. జానకి ఇద్దరూ తమ తమ రంగాలలో శిఖర సమానులు. ఒకరు నటనతో వెండితెరను ఏలితే, మరొకరు తన మధురమైన గొంతుతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. అయితే, వీరిద్దరి కెరీర్ ప్రారంభంలో ఒక ఆసక్తికరమైన వివాదం నడిచింది. సావిత్రి నటించే సినిమాలకు పాడనని ఎస్. జానకి ఒకానొక సమయంలో పట్టుబట్టారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఆ అసలు కథ ఏంటి? ఆ రోజుల్లో సావిత్రి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆమె నటించే సినిమాలకు ఎక్కువగా పి. లీల, పి. సుశీల పాటలు పాడేవారు. ముఖ్యంగా తన హావభావాలకు, నటనకు సుశీలమ్మ గొంతు మాత్రమే సరిగ్గా సరిపోతుందని సావిత్రి గట్టిగా నమ్మేవారు. సావిత్రి సినిమాలకు సుశీల మాత్రమే పాడాలనే ఒక నియమం కూడా ఉండేది. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ, తన కెరీర్ ప్రారంభంలో ఒక తమిళ సినిమాలో సావిత్రి పాత్ర కోసం ఒక అద్భుతమైన పాటను ఆలపించారు. రికార్డింగ్ పూర్తయ్యాక ఆ పాట చాలా బాగా వచ్చింది. కానీ, సావిత్రి మాత్రం తన నటనకు జానకి వాయిస్ కంటే సుశీల వాయిస్ అయితేనే బాగుంటుందని భావించారు. దాంతో జానకమ్మ పాడిన ఆ పాటను పక్కన పెట్టి, మళ్లీ పి. సుశీల చేత రీ-రికార్డింగ్ చేయించారు. ఈ విషయం ఎస్. జానకి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తాను ఎంతో కష్టపడి పాడిన పాటను కేవలం వాయిస్ సూట్ అవ్వలేదు అనే కారణంతో మార్చేయడం జానకమ్మకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ అవమానాన్ని భరించలేని జానకి.. "ఇకపై సావిత్రి నటించే సినిమాలకు నేను ఎప్పటికీ పాటలు పాడను" అని ఒక శపథం చేశారు. అన్నట్టుగానే ఒకానొక సందర్భంలో సావిత్రి నటిస్తున్న ఒక చిత్రంలోని ‘నీలిల పాడేద దేవ’ అనే పాటను పాడటానికి జానకమ్మ నిరాకరించారు. ఆ పాట రికార్డింగ్‌ను దాదాపు మూడు నెలల