మహేంద్ర దేవ్ .. బాబు రాగానే మాట మారిందా
Actor ProfilePolitician

మహేంద్ర దేవ్ .. బాబు రాగానే మాట మారిందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహేంద్ర దేవ్ .. బాబు రాగానే మాట మారిందా
Sakshi13 Dec 2026
మహేంద్ర దేవ్ .. బాబు రాగానే మాట మారిందా

దేశానికి మేధావులు ఎంతో కీలకం. వారు దేశాన్ని నడిపే రాజకీయ నేతలకు సరైన మార్గ నిర్దేశనం చేస్తే సమాజానికి మేలు చేసినవారు అవుతారు. కాని అదే మేధావులు కూడా, తమ స్వార్థ ప్రయోజనాలకోసమో, లేక ఏదో పార్టీకి మేలు చేయడం కోసమో రాజకీయ కోణంలో మాట్లాడితే అది దేశానికి తీరని నష్టం చేసినవారు అవుతారు. దురదృష్టవశాత్తు కొందరు మేధావుల ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆ జాబితాలో ఆర్థికవేత్తగా ఉన్న సూర్యదేవర మహేంద్రదేవ్ కూడా చేరడం బాధాకరంగా ఉంది. ప్రముఖ చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ అంటే తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం. అలాంటి గొప్పవ్యక్తి కుమారుడు అయిన మహేంద్రదేవ్ గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నదానిని పక్కనబెడితే, ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పే విషయాలను కూడా నమ్మకూడదన్న అభిప్రాయం ప్రజలలో కలగదా? అది మేధావి వర్గానికి సిగ్గు చేటు అవుతుందా? కాదా? మహేంద్రదేవ్ 2024 ఎన్నికలముందు ఏప్రిల్ నెలలో ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్రాకు అప్పులే శాపం అని వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఆధారంతో అన్నారో తెలియదు కాని ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. అందులో ఏ ప్రభుత్వ వాటా ఎంత అన్నది చెప్పినట్లు లేరనుకోండి. ఇది సరిగ్గా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలిగా ఆ రోజుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు చెప్పిన అసత్య మాటల మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది గదా! నిరుద్యోగం తాండవిస్తోందని, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా

మహ ద ర ద వ బ బ ర గ న మ ట మ ర ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in