
Eenadu•26 Oct 2026
మహేంద్రగిరి యుద్ధనౌక ప్రారంభంవిశాఖలోని తూర్పు నావికాదళంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి యుద్ధనౌక కొలువుదీరింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నీలగిరి శ్రేణి నౌక. ఈ యుద్ధ నౌకను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు. పుట్టపర్తిలో ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు ఏర్పాటవుతోందన్నారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలోఉంచుకొని భారత నావికాదళం అప్రమత్తంగా ఉందన్నారు. మహేంద్రగిరి యుద్ధనౌక ప్రారంభం