మహమ్మద్ అలీ జిన్నా.. రాహుల్ గాంధీ రూపంలో మరలా జన్మించారు
Actor ProfilePolitician

మహమ్మద్ అలీ జిన్నా.. రాహుల్ గాంధీ రూపంలో మరలా జన్మించారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మహమ్మద్ అలీ జిన్నా.. రాహుల్ గాంధీ రూపంలో మరలా జన్మించారు
AP7AM10 Dec 2026
మహమ్మద్ అలీ జిన్నా.. రాహుల్ గాంధీ రూపంలో మరలా జన్మించారు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా, రాహుల్ గాంధీ రూపంలో పునర్జన్మించారని, జిన్నా కంటే కూడా రాహుల్ అత్యంత ప్రమాదకరమైన నాయకుడని బుధవారం ఆయన విమర్శించారు. ఈ మేరకు తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.ఝార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో దూబే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణను కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన నిలదీశారు. ప్రధాన నిందితుడు ఝార్ఖండ్ ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి నివాసంలో పట్టుబడ్డాడని, ఒకవేళ సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరిగితే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా చిక్కులు తప్పవని ఆరోపించారు.విద్యార్థులకు నిజంగా సంఘీభావం తెలపాలనుకుంటే ఝార్ఖండ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని దూబే సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఆ పార్టీ జార్జ్ సోరోస్ అజెండాతో పనిచేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా ఎక్కడ నిరసనలు జరిగినా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షమవుతున్నారని ఆయన మండిపడ్డారు.ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్‌సీ) పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థులు 19 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, వివాదాస్పద పరీక్షల రద్దు, స్వతంత్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్, వాటర్ కేనన్లు, బాష్పవాయువు ప్రయోగించడంతో బీజేపీ రాష్ట్రవ్యాప్త

మహమ మద అల జ న న ర హ ల గ ధ ర ప ల మరల జన మ చ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in