
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హోర్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా... జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి అందులో 11 మంది భారతీయులు.. ఒకరు గల్లంతు.. దాడిని ఖండించిన భారత్ సిబ్బందిని రక్షించేందుకు ఒమన్‌తో కలిసి రెస్క్యూ ఆపరేషన్ ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా.. 140 లక్ష్యాలపై దాడి.. ఇరాన్ ప్రతిదాడులు బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్‌లలోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, జూలై 12: పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల మొదలైన పరస్పర దాడులు మరింతగా ముదిరాయి. హోర్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోందంటూ మరో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై విరుచుకుపడింది. ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. అంతేకాదు హోర్ముజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇరాన్ దాడి చేసిన వాణిజ్య నౌకలో 11 మంది భారతీయులు ఉండగా.. అందులో పదిమందిని రక్షించారు. మరొకరు గల్లంతయ్యారు. అమెరికాతో ఇటీవలి అవగాహన ఒప్పందం తర్వాత ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తెరిచినా.. తమకు సమాచారమిచ్చి, టోల్ చెల్లించిన నౌకలను మాత్రమే, అదీ తాము నిర్దేశించిన మార్గం మీదుగా ప్రయాణించేందుకు అనుమతిస్తోంది. ఆ మార్గం ఇరాన్ తీరానికి దగ్గరగా ఉంది. మరోవైపు ఒమన్ తీరానికి సమీపంలోని మరో మార్గం నుంచి ప్రయాణించేలా కంటెయినర్ నౌకలు, చమురు ట్యాంకర్లకు అమెరికా సూచనలు చేస్తోంది. అలా నౌకలు ప్రయాణిస్తే హోర్ముజ్‌పై తమ పట్టు సడలిపోతుందని భావిస్తున్న ఇరాన్.. వాటిపై దాడులు చేస్తోంది. ఇలా గత వారం రోజుల్లోనే పది వరకు నౌకలపైకి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి దెబ్బతీసింది. దీనిని తప్పుపడుతూ ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున ఒమన్