మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్ .. గల్ఫ్ దేశాలు గడగడ
Actor ProfilePolitician

మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్ .. గల్ఫ్ దేశాలు గడగడ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్ .. గల్ఫ్ దేశాలు గడగడ
Eenadu31 Oct 2026
మళ్లీ హర్మూజ్ ను మూసేసిన ఇరాన్ .. గల్ఫ్ దేశాలు గడగడ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సైప్రస్ జెండాతో హర్మూజ్‌లో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిపిందని.. ఈ జలసంధిని మరోసారి మూసివేస్తునట్లు (Hormuz closed) ఇరాన్‌ ప్రకటించింది. ఈ దాడి కారణంగా నౌకలోని ఒక సిబ్బంది మృతి చెందినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధ్రువీకరించింది. ఇరాన్ ఓ తప్పుడు నిర్ణయం తీసుకుందని.. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌ హెచ్చరించారు. దీంతో టెహ్రాన్‌పై అమెరికా దాడులు కొనసాగించే అవకాశం ఉందని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హర్మూజ్‌ తీరంలోని రెండు పట్టణాలపై అమెరికా విరుచుకుపడంతో (US strikes) 10 చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్‌ వెల్లడించింది. కాగా టెహ్రాన్‌పై మూడో విడత దాడులు పూర్తి చేశామని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించింది. మొత్తం 140 టార్గెట్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. బుషెహర్ ప్రావిన్స్‌పై జరిపిన దాడుల్లో ఒక సైనిక స్థావరంతో సహా పలు ప్రాంతాలు దెబ్బతిన్నట్లు సమాచారం. తాజా దాడులతో ఇరాన్ (Iran) గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని ప్రభుత్వ మీడియా వర్గాలు వెల్లడించాయి. టెహ్రాన్‌పై దాడులకు ప్రతీకారంగా కువైట్ (Kuwait).. బహ్రెయిన్‌, ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేపట్టినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. కువైట్‌.. బహ్రెయిన్‌ (Bahrain)లలోని యూఎస్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధ డిపో, రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. ఈ దాడులతో బహ్రెయిన్ అంతటా సైరన్‌లు మోగుతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దోహాలో భారీ పేలుళ్ల వినిపిస్తుండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తలల నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నట్లు గల్ఫ్‌ దేశాలు ప్రకటించాయి. క్షిపణి ముప్పును ఎదుర్కోవడానికి తమ గగనతల రక్షణ వ్యవస్థలు చురుగ్గా ప్రతిస్పందిస్తున్నాయని యూఏఈ వెల్లడించింది. ఖతార్‌లోని అల్ ఉదైద్

మళ ల హర మ జ న మ స స న ఇర న గల ఫ ద శ ల గడగడ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in