మళ్లీ సంక్రాంతి సీజన్
Actor ProfileActor

మళ్లీ సంక్రాంతి సీజన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ సంక్రాంతి సీజన్ పై కన్నేసిన రవితేజ.. శ్రీవిష్ణుతో కలిసి నవ్వుల జాతర
Samayam Telugu24 Sept 2026
మళ్లీ సంక్రాంతి సీజన్ పై కన్నేసిన రవితేజ.. శ్రీవిష్ణుతో కలిసి నవ్వుల జాతర

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన స్పీడును మరింత పెంచారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రంతో అలరించిన ఆయన ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి పండగను కూడా టార్గెట్ చేస్తూ చకచకా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ‘ ఇరుముడి ’ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా ముగియక ముందే ఆయన తన నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడం విశేషం.* ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కోసం త్రివిక్రమ్ అదిరిపోయే ప్లాన్.. రంగంలోకి బాలీవుడ్ స్టార్!శ్రీవిష్ణుతో మల్టీస్టారర్‘రాజా రాజ చోర’ ఫేమ్ దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో రవితేజ ఒక కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఈ వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రంలో మరో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. హసిత్ గోలి మార్క్ నవ్వులు, వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రం ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి పండగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.* వాళ్ల రేంజ్ మారిపోయింది.. అందుకే కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు – రాధా రవిఆగస్టు 21న ‘ఇరుముడి’ రాక:ఇదిలా ఉంటే రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఇరుముడి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ కలబోతగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన కథానాయికగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన "ఇరుముడి

మళ ల స క ర త స జన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in