మళ్లీ మంటలు
Actor ProfilePolitician

మళ్లీ మంటలు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
మళ్లీ మంటలు
Andhra Jyothy12 Oct 2026
మళ్లీ మంటలు

పరస్పరం భారీ దాడులకు దిగిన అమెరికా, ఇరాన్‌ ఇరాన్‌లోని 80కిపైగా క్షిపణి, డ్రోన్‌ స్థావరాలు, రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడ్డ అమెరికా ప్రతిగా గల్ఫ్‌లోని 85 అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడిచేసిన ఇరాన్‌ నిలిచిన చమురు నౌకల రాకపోకలు బెదిరింపుల శకం ముగిసిపోయింది హోర్ముజ్‌లో ఎవరి జోక్యాన్నీ సహించం: ఇరాన్‌ ఖమేనీ అంత్యక్రియల వేళ ఉద్రిక్త పరిణామాలు కాల్పుల విరమణ ముగిసినట్టే! ఇరాన్‌ పాలకులు మూర్ఖులు.. చర్చలు వృథా మళ్లీ భారీ స్థాయిలో దాడులు చేస్తాం ఖార్గ్‌ దీవిని స్వాధీనం చేసుకుంటాం ఇరాన్‌ చమురు విక్రయ లైసెన్సు రద్దు ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరగొచ్చు కానీ సానుకూల ఫలితం అనుమానమే: ట్రంప్‌ వాషింగ్టన్‌/టెహ్రాన్‌/న్యూఢిల్లీ, జూలై 8: పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. యుద్ధం నిలిపివేత వ్యవహారం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్‌ దాటుతున్నాయంటూ వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులు చేయడంతో యుద్ధం మళ్లీ మొదలైంది. నౌకలపై దాడులకు ప్రతిగా ఇరాన్‌లోని కీలక రక్షణ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయగా... దానికి దీటుగా స్పందిస్తూ కువైట్‌, బహ్రెయిన్‌ సహా గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మండిపడ్డారు. ఇరాన్‌తో యుద్ధం నిలిపివేతకు సంబంధించిన అవగాహన ఒప్పందం ముగిసిపోయినట్టేనని.. ఇరాన్‌తో చర్చలతో సమయం వృధా తప్ప లాభమేమీ లేదని ప్రకటించారు. ఇరాన్‌పై తిరిగి భారీ స్థాయిలో దాడులకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్‌ చమురును విక్రయించుకునేందుకు ఇచ్చిన లైసెన్సును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్‌ దివంగత సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన మొదలైంది. దాడుల భయంతో హోర్ముజ్‌ మీదుగా చమురు నౌకల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురుకు మళ్లీ రెక్కలు

ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు
Samayam Telugu1 Oct 2026
ట్రంప్ వ్యాఖ్యలతో హార్మూజ్ లో మళ్లీ మంటలు.. వాణిజ్య నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా