మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవే
Actor ProfileActor

మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవే
TV9 Telugu23 Dec 2026
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. కొనాలనుకునేవారికి షాక్.. లేటెస్ట్ రేట్లు ఇవే

బంగారం ధరలు భారీగా పెరిగాయి. మూడ్రోజులుగా పడిపోతూ వస్తోండగా.. శనివారం తగ్గుదలకు బ్రేక్ పడింది. గంటల్లోనే ధరలన్నీ తారుమారు అయ్యాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగిలిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ పెంపు తర్వాత దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.710 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 పలుకుతుండగా.. శుక్రవారంతో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.650 పెరిగింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,910 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,42,000 వద్ద పలుకుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,200 వద్ద ట్రేడవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,280 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 పలుకుతున్నాయి. అటు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలు పలుకుతోంది

మళ ల భగ గ మన న బ గ ర ధరల క న లన క న వ ర క ష క ల ట స ట ర ట ల ఇవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in