
పుర ఎన్నికలపై వీడని సందిగ్ధం శ్రీకాకుళం, ఆమదాలవలసలో పరిస్థితిపై చర్చ న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస పట్టణం శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస పట్టణంలో ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఏళ్ల నుంచి ఇక్కడ పాలకవర్గాలు లేవు. విలీన పంచాయతీల వివాదాలు, న్యాయస్థానాల్లో పిటిషన్ల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. వివాదాలు పరిష్కరించి త్వరలో అన్ని పురపాలికల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. శ్రీకాకుళం పురపాలక సంఘం 2015 డిసెంబరు తర్వాత నగరపాలకసంస్థగా మారింది. 2005లో అక్టోబర్‌లో చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం పదవీకాలం 2010 సెప్టెంబరుతో ముగిసిపోయింది. 2005లో శ్రీకాకుళం సమీపంలోని చాపురం, పాత్రునివలస, పెద్దపాడు, కిల్లిపాలెం, ఖాజీపేట, కుశాలపురం, తోటపాలెం పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో 2015 నుంచి పుర పోరు జరగలేదు. ఆమదాలవలస పురపాలక సంఘంలో 2019 నుంచి ఎన్నికలు జరగలేదు. పట్టణంలో ఎనిమిదేళ్లుగా ప్రత్యేకాధికారి పాలనే సాగుతోంది. పాలక వర్గం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంఘాలు ఇచ్చే నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేకుండా పోతోంది. ఫలితంగా పురాభివృద్ధి కుంటుపడుతోంది. వైకాపా ప్రభుత్వం 2019లో మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులను 27గా పునర్విభజన చేసింది. ఆ విభజన శాస్త్రీయంగా లేదని అప్పటి 6వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జి బోర గోవిందరావు కోర్టును ఆశ్రయించారు. వార్డుల సరిహద్దుల గుర్తింపు, ఓట్ల విభజన సక్రమంగా జరగలేదని వ్యాజ్యం వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించలేదు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల