మల్లెపూల పల్లకి' సాంగ్ కి థియేటర్లు షేక్
Actor ProfileActor

మల్లెపూల పల్లకి' సాంగ్ కి థియేటర్లు షేక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మల్లెపూల పల్లకి' సాంగ్ కి థియేటర్లు షేక్
TeluguOne26 Jan 2027
మల్లెపూల పల్లకి' సాంగ్ కి థియేటర్లు షేక్

మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సాలిడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటుని తీరుస్తూ నేడు గ్రాండ్‌గా థియేటర్లలోకి అడుగుపెట్టిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సునామీ సృష్టిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. "ఇది రవితేజకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్". సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రతీ సీన్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే 'మల్లెపూల పల్లకి' పాట థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. ఆ పాట స్క్రీన్ మీద ప్లే అవుతుంటే ప్రేక్షకులు సీట్లలో అసలు కూర్చోలేకపోతున్నారు. థియేటర్లన్నీ ఒక్కసారిగా ఊగిపోతున్నాయి. కొందరైతే ఉత్సాహాన్ని ఆపుకోలేక స్క్రీన్ ముందుకు వెళ్ళి స్టెప్పులేస్తున్నారు. చాలారోజుల తర్వాత థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. ఒక మాస్ హీరో పవర్‌ఫుల్ కథతో, హై-వోల్టేజ్ ఎమోషన్‌తో వస్తే థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో 'ఇరుముడి' మరోసారి నిరూపించింది. రవితేజ యాక్టింగ్, ముఖ్యంగా 'మల్లెపూల పల్లకి' పాట ఇచ్చే గూస్‌బంప్స్ స్టఫ్.. ఖచ్చితంగా థియేటర్లో ఆస్వాదించాల్సిందే. రవితేజ 'ఇరుముడి' బుకింగ్స్ సునామీ: ఇదయ్యా నీ అసలు రూపం.!