మరోసారి ధనుష్
Actor ProfilePolitician

మరోసారి ధనుష్

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy26 Oct 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! మెగాస్టార్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కన్నుమూత
Chitrajyothy26 Oct 2026
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కన్నుమూత

ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు ఆర్‌. చెళియన్‌ (57) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తరమణిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ

మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్ కు గూస్ బంప్స్
Chitrajyothy24 Oct 2026
మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్ కు గూస్ బంప్స్

కోలీవుడ్‌లో తిరుగులేని కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్, సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. కోలీవుడ్‌లో తిరుగులేని కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran) మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘పొల్లాదవన్, ఆడుగలం, వడ చెన్నై, అసురన్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘తమిళ్ మురుగన్’ (Thamizh Murugan) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను ధనుష్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి. ‘‘ది ఎటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, తమిళ ప్రజలు, వారి నేలకి రాజు, నాయకుడు.. #sonofkottravai తమిళ్ మురుగన్’’ అంటూ పెట్టిన క్యాప్షన్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉండబోతుందనే విషయాన్ని ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. యుద్ధ క్షేత్రంలో వేలాది మంది సైనికుల మధ్య ధనుష్ ఒక భారీ ఏనుగుపై వీరుడిలా కూర్చొని ఉన్న విజువల్స్‌తో ఈ గ్లింప్స్‌ని వదిలారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్ ఓవర్, మ్యూజిక్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తున్నాయి. వండర్‌బార్ ఫిలింస్, ప్రొడక్షన్ మైల్స్ టు గో బ్యానర్లపై ఈ చిత్రం సంయుక్తంగా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, అరివుమతి కథను సమకూర్చారు. వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌కు తోడు, ధనుష్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది

మర స ర ధన ష Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in