మరోసారి కోర్టుకు హాజరైన బన్నీ
Actor ProfilePolitician

మరోసారి కోర్టుకు హాజరైన బన్నీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరోసారి కోర్టుకు హాజరైన బన్నీ, వాయిదా పడిన కేసు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema6 Jan 2027
మరోసారి కోర్టుకు హాజరైన బన్నీ, వాయిదా పడిన కేసు - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సంధ్య థియేటర్ (Sandhya Theater Stampede) తొక్కిసలాట ఘటన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులందరికీ బెయిల్ మంజూరు కాగా, విచారణ మినిమం గ్యాప్స్ లో త్వరితగతిన సాగుతోంది. ఈరోజు జరిగిన విచారణకు వర్చువల్ గా హాజరయ్యాడు అల్లు అర్జున్ (Allu Arjun). ముంబయిలో షూటింగ్ లో ఉన్న బన్నీ జడ్జి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితులందరికీ చార్జ్ షీటు కాపీలు అందించారు. ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ జడ్జి ఆదేశించగా, బన్నీ ప్రత్యేక అనుమతి కోరాడు. ముంబయిలో షూటింగ్ కారణంగా, వీడియో కాల్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరాడు. అలా ఈ కేసు విచారణకు వర్చువల్ గా హాజరవుతున్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప-2’ బెనిఫిట్ షో టైమ్ లో సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఆ టైమ్ లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతడు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. గాయపడినప్పట్నుంచి ఇప్పటివరకు అతడి ఆలనాపాలనతో పాటు, ఆ కుటుంబ బాధ్యత మొత్తాన్ని బన్నీ తీసుకున్నాడు. ఓవైపు ఆ కుర్రాడి ఆరోగ్యాన్ని చూసుకుంటూనే, మరోవైపు కోర్టు విచారణకు హాజరవుతున్నాడు. ఈ కేసులో ఎ-11గా కొనసాగుతున్నాడు బన్నీ

మర స ర క ర ట క హ జర న బన న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in