మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే
Actor ProfileActor

మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే
Zee Telugu25 Dec 2026
మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Allu Arjun Independence Flag Controversy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. వివాదానికి కారణం ఏమిటి? స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అయితే, ఆ జెండా మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం అందులో కనిపించలేదు. దీంతో బాధ్యత గల ప్రముఖ నటుడిగా జాతీయ పతాకాన్ని సరిచూసుకోకుండా పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలో చక్రం లేకపోయినా, అల్లు అర్జున్ తన సొంత లోగోను మాత్రం స్పష్టంగా వేసుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పెరుగుతుండటంతో బన్నీ వెంటనే ఆ పోస్టును తొలగించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ లైనప్ ప్రాజెక్ట్స్ మరోవైపు, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 'రాకా' భారీ బడ్జెట్‌తో వస్తోంది. గిరిజన, పురాణ నేపథ్యం, సమకాలీన కాలం అనే రెండు విభిన్న ప్రపంచాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానున్న ఈ