మరో రెండు వంతెనలు.. ఓ ర్యాంప్
Actor ProfilePolitician

మరో రెండు వంతెనలు.. ఓ ర్యాంప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరో రెండు వంతెనలు.. ఓ ర్యాంప్
Andhra Jyothy13 Dec 2026
మరో రెండు వంతెనలు.. ఓ ర్యాంప్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌జామ్‌కు చెక్‌ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‏ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. నిర్మాణ సంస్థ ఎంపిక.. ఆమోదించిన పురపాలక శాఖ హైదరాబాద్‌ సిటీ: మహా నగరంలో ట్రాఫిక్‌జామ్‌కు చెక్‌ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(హెచ్‌-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‏ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి. మరికొన్ని జంక్షన్ల వద్ద వంతెనల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేస్తోంది. టెండర్‌ ప్రక్రియలో భాగంగా ఏజెన్సీల ఎంపికకూ ఆమోదం తెలుపుతోంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లై ఓవర్‌ నుంచి సంతోష్‌నగర్‌ వైపు వెళ్లేలా ఎడమ వైపు ర్యాంపు, హఫీజ్‌బాబా నగర్‌ జంక్షన్‌ నుంచి బాలాపూర్‌ 100 అడుగుల రోడ్డు వరకు, బండ్లగూడ- ఎర్రకుంట ఎక్స్‌ రోడ్‌ వద్ద ఆరు లేన్ల వంతెనల నిర్మాణం కోసం ఏజెన్సీ ఎంపికకు సర్కార్‌ ఆమోదం తెలుపుతూ బుధవారం పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.242.72 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ వంతెనలు, ర్యాంప్‌ను ఒకే ప్యాకేజీగా చేపట్టనున్నారు. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.231.87 కోట్లుగా అంచనా వేయగా.. 4.68 శాతం ఎక్కువకు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ లిమిటెడ్‌ బిడ్‌ దాఖలు చేసింది. రెండు పర్యాయాలు టెండర్‌ ప్రకటించినా.. సింగిల్‌ బిడ్‌ దాఖలు కావడంతో అదే సంస్థను ఎంపిక చేశారు. ఆస్తుల సేకరణతో కలిపి ప్రాజెక్టుకు రూ.385 కోట్లు అవసరమని అంచనా వేయగా సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.పనులు చేపట్టేందుకు ఏజెన్సీతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఒప్పందం కుదర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంతెనలు పూర్తయితే పాతబస్తీలో పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సులువు కానున్నాయి. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం