మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్
Actor ProfileActor

మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్
Sakshi1 Nov 2026
మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్

అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్‌ తప్పాడు. స్విట్జర్లాండ్‌తో క్వార్టర్‌ ఫైనల్‌ సందర్భంగా ‘మర్యాదగా మాట్లాడండి’ అంటూ మ్యాచ్‌ రిఫరీకి మెస్సీ వార్నింగ్‌ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. స్విట్జర్లాండ్ ఫ్రీ కిక్‌కు సిద్ధమవుతున్న సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు డిఫెన్సివ్ వాల్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మెస్సీని నిబంధనల ప్రకారం కొంత వెనక్కి వెళ్లాలని పోర్చుగల్‌ రిఫరీ జోవో పిన్‌హీరో సూచించారు. అయితే రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో మెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో మర్యాదగా మాట్లాడండి. నన్ను అగౌరవపరచొద్దు. నేను మీతో గౌరవంగా మాట్లాడాను.. మీరు కూడా అలాగే మాట్లాడండి’ అంటూ మెస్సీ రిఫరీకి చెబుతున్నట్లు మైక్‌లో రికార్డయ్యాయి. ఈ ఫిఫాలో ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క గోల్‌ అయినా కొట్టిన మెస్సీ స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం గోల్‌ సాధించలేదు. అయితే ఒక అసిస్ట్‌తో మెస్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ విషయానికొస్తే స్విట్జర్లాండ్‌పై విజయంతో అర్జెంటీనా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జ‌ర్లాండ్‌పై విజ‌యం సాధించింది. ఆట అద‌న‌పు స‌మ‌యంలో రెండు గోల్స్ చేసిన అర్జెంటీనా స్విట్జ‌ర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అర్జెంటీనా త‌ర‌ఫున అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్ (10వ నిమిషం), జులియ‌న్ అల్వ‌రెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) అద‌న‌పు స‌మ‌యంలో గోల్ చేశాడు. స్విట్జ‌ర్లాండ్ త‌ర‌ఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. చదవండి: అర్జెంటీనా దిగ్గ‌జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన‌ యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు) శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని.. ‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా

మర య దగ మ ట ల డ డ మ స స మ స వ ర న గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in