
మహిళలకు మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్దమైంది. ప్రతీ నెలా అర్హత ఉన్న వారి ఖాతా ల్లో రూ 2,500 జమ కానుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికంగా వెనుకబడిన మహిళల కు రక్షాబంధన్ సందర్భంగా ప్రభుత్వం భారీ కానుకను అందించనుంది. మహిళా సమృద్ధి యోజనను అధికారికంగా లక్ష్మి యోజన పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్దికంగా వెనుకబడిన మహిళలకు ప్రతీ నెఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన కీలక హామీ మేరకు ఈ అమలు నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిన్నర పాలన పూర్తయినా మహిళలకు ఆర్థిక సహకారం అందించే పథకాన్ని అమలు చేయలేదని ఆప్ నుంచి విమర్శలు వస్తున్న వేళ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేసే ఈ పథకం కోసం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.5,100 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 17 నుంచి 22 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. జమిలి, డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ ట్విస్ట్ - విపక్షాలు ఊహించని విధంగా..!!రక్షాబంధన్ నుంచి అమలుకాగా, ఈ పధకం అమలుకు సంబంధించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు సిద్దం అవుతున్నారు. అందు లో భాగంగా పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లబ్ధిదారుల డేటా ధృవీకరణ తర్వాత మధ్యవర్తులు లేకుండా నిర్దారించిన లబ్దిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పధకం ద్వారా జమ చేస్తారు.