మరణాన్ని జయించిన మానవత్వం
Actor ProfileActor

మరణాన్ని జయించిన మానవత్వం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మరణాన్ని జయించిన మానవత్వం
Sakshi1 Oct 2026
మరణాన్ని జయించిన మానవత్వం

రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలుడి బ్రెయిన్‌డెడ్‌ గంభీరావుపేట(సిరిసిల్ల): బుడిబుడి నడకలను చూసి సంబురపడ్డ తల్లిదండ్రుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. అంబులెన్స్‌ రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని ఢీకొట్టగా బ్రెయిన్‌డెడ్‌ అయ్యాడు. ఇంత విషాదంలోనూ ఆ కుటుంబ సభ్యులు బాలుడి అవయవాలను దానం చేసి మరో ఆరుగురికి పునర్జన్మను ప్రసాదించారు. బాలుడు తను వెళ్లిపోతూ ఆరుగురి రూపంలో ఈ లోకంలోనే ఉండిపోయాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బొంబాయి పాపారావు కూతురు సౌమ్య, అల్లుడు రఘు ఉద్యోగరీత్య తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా రాధాపురంలో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు యశ్వన్‌(7) గత నెల 29న సైకిల్‌ తొక్కుకుంటూ ఉండగా అతివేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి తలకు తీవ్ర గాయాలై బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. ఎంత ప్రయత్నించినా బాలుడిని కాపాడుకోలేకపోయారు. ఇంత విషాదంలో యశ్వన్‌ తల్లిదండ్రులు, తాత పాపారావు బాలుడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు కిడ్నీలు, కాలేయం, గుండె కవాటం, రెండు కంటి పాపలను ఇతరులకు మార్పిడి చేశారు. ఆరుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన యశ్వన్‌ తన మరణానంతరం చిరంజీవిగా నిలిచిపోయాడు. చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపోయిన యశ్వన్‌ భౌతికంగా లేకపోయినా అతని గుండెచప్పుడు, చూపు, జీవం మరో ఆరుగురిలో కొనసాగుతోంది. సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు) తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) తిరుమల శ్రీవారి సేవలో నాగార్జున కుటుంబం (ఫొటోలు) మాల్దీవులు ట్రిప్ వేసిన హీరోహీరోయిన్ జంట (ఫొటోలు) అలీ ఖమేనీ అంతిమ యాత్ర.. ట్రంప్ ను హతమార్చాలి సంచలన ఆడియో లీక్ .. ఏదేమైనా.. నా భర్తను చంపే బాధ్యత నీదే.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు... YSRCP శృంగరపాటి సందీప్ కుమార్ బలవంతపు అక్రమ అరెస్ట్ ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని

మరణ న న జయ చ న మ నవత వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in