మయన్మార్ లో చిక్కుకున్న ఏపీ యువతను ఆదుకుంటాం
Actor ProfilePolitician

మయన్మార్ లో చిక్కుకున్న ఏపీ యువతను ఆదుకుంటాం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మయన్మార్ లో చిక్కుకున్న ఏపీ యువతను ఆదుకుంటాం
AP7AM1 Dec 2026
మయన్మార్ లో చిక్కుకున్న ఏపీ యువతను ఆదుకుంటాం

ఉద్యోగాల పేరుతో మోసపోయి మయన్మార్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. బ్యాంకాక్‌లో ఉద్యోగాలంటూ నమ్మించి కొందరిని మయన్మార్‌కు తరలించిన నేపథ్యంలో బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు.వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన పలువురు నిరుద్యోగ యువకులు మయన్మార్‌లో చిక్కుకుపోయారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి లోకేశ్‌, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ యువతకు కీలక సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు పన్నే ఉచ్చులో పడొద్దని, ఉద్యోగాల విషయంలో పూర్తిస్థాయిలో ఆరా తీయకుండా ఎవరినీ నమ్మవద్దని హితవు పలికారు. ఇలాంటి మోసాలపై యువత చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు

మయన మ ర ల చ క క క న న ఏప య వతన ఆద క ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in