మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు
Actor ProfilePolitician

మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు
TeluguOne29 Nov 2026
మన్యంలో నేలలో అపార ఖనిజ సంపద.. గిరిజనుల బతుకులు మారేదెప్పుడు

మన్యం నేలలో నిధులు.. మారని మన్యం బిడ్డల రాత..! కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..! కానీ, ఆ మట్టిపై తాతల ముత్తాతల నుంచి బతుకుతున్న గిరిజనుడి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంకా అడవి తల్లి ఒడిలోనే పేదరికంతో, రోగాలతో, సరైన ఉపాధి లేక అలమటిస్తున్న మన్యం బిడ్డల కన్నీటి గాథ ఇది. అపరిమిత సంపద ఉన్న ప్రాంతంలో పుట్టి కూడా, దిక్కులేని బతుకులు ఈడుస్తున్న వారి స్థితిగతులు నేటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని పలు అంశాలపై తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, ఏపీ మాజీ గనుల డైరెక్టర్ డాక్టర్ వి.డీ రాజగోపాల్ మధ్య ఆసక్తికర విశ్లేషణ జరిగింది దళారుల దోపిడీ నుంచి కట్టెల మోపుల వరకు... ఆరని ఆవేదనతరతరాలుగా కొండల్లో లభించే అటవీ ఉత్పత్తులను మోసుకొచ్చి వారపు సంతల్లో అమ్ముకోవడమే మన్యం ప్రజల ప్రధాన బతుకు దెరువు. గతంలో దళారులు ఆ అమాయక గిరిజనులను ఏ స్థాయిలో దోచుకున్నారో అందరికీ తెలిసిందే. పది రూపాయల విలువైన వస్తువును కేవలం పది పైసలకే కొట్టేసి, వారి రెక్కల కష్టాన్ని నట్టేట ముంచేవారు. ఆ తర్వాత గిరిజన సహకార సంస్థ (GCC) వంటివి అందుబాటులోకి వచ్చి కొంతవరకు మద్దతు ధర అందించినప్పటికీ, గిరిజనుల జీవితాల్లో రావాల్సిన పూర్తిస్థాయి ఆర్థిక విప్లవం ఇంకా రాలేదు. నేటికీ 70 ఏళ్ల వయసొచ్చిన పసితనం చావని తాతలు, అవ్వలు కొండల్లో కట్టెల మోపులు తలపై పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బతుకీడుస్తున్న దృశ్యాలు మన్యంలో గుండెలను పిండేస్తుంటాయి. మైనింగ్ భయాలు vs ప్రగతి అవకాశాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని బాక్సైట్ నిల్వలను సమర్థవంతంగా, పర్యావరణానికి భంగం వాటిల్లకుండా వినియోగిస్తే అక్కడ అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి. మైనింగ్ అనగానే కేవలం పర్యావరణ విధ్వంసమనో, గిరిజనులను వెళ్లగొడతారనో భయపెట్టే

మన య ల న లల అప ర ఖన జ స పద గ ర జన ల బత క ల మ ర ద ప ప డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in