
సౌత్ లో లెజెండ్రీ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శివ శంకర్ మాస్టర్ ఒకరు. భరత నాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్స్ తో ఆయనకి అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. సినిమాల్లో ఎక్కువగా ఆయన క్లాసికల్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించారు. ఎన్నో వందల పాటలకు కొరియోగ్రఫీ అందించిన శివ శంకర్ మాస్టర్ ఓ సాంగ్ కి జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కెరీర్ లో టాప్ 5 బెస్ట్ సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రంలోని ఈ ఐకానిక్ సాంగ్. చిరంజీవి, మాధవి చేత శివ శంకర్ మాస్టర్ అద్భుతంగా నాగిని డ్యాన్స్ చేయించారు. అప్పట్లో ఈ సాంగ్ ఒక సంచలనం. శివ శంకర్ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు.. చిరు, మాధవి మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయితాయి. ఖైదీ చిత్రం చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో అరుంధతి ఒకటి. ఈ సినిమా అనుష్కకి స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తీసుకువచ్చింది. ఈ మూవీలో భూం భూం భుజంగం దీత్తై తరంగం అనే పవర్ ఫుల్ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. ఒక ప్రత్యేక సందర్భంలో ఈ పాట వస్తుంది. కథానాయిక అయిన అనుష్క, విలన్ సోనూసూద్ మధ్య ఒక సన్నివేశంలాగా సాగే పాట ఇది. ఈ పాటలో డ్యాన్స్ తో పాటు నటన కూడా చాలా కీలకం. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ శివ శంకర్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. 2003లో విడుదలైన తిరుడా తిరుడి చిత్రంలోది ఈ సాంగ్. మన్మథ రాసా సాంగ్ అప్పట్లో యువతని, మాస్ ఆడియన్స్ ని ఊపు ఊపేసింది. ఈ చిత్రంలో ధనుష్, ఛాయా సింగ్ జంటగా నటించారు. తన కెరీర్ కి గుర్తింపు తీసుకువచ్చిన ఈ పాటని, శివ శంకర్