80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు, యువత విదేశాలకు వలస వెళ్లడం, దేశ అభివృద్ధి తీరుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తన కుమార్తె ఉన్నత విద్య కోసం అమెరికాలో చదువుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన కుమార్తెను అమెరికాలో చదివించాల్సి రావడానికి దేశంలో అంతర్జాతీయ స్థాయి గొప్ప విద్యాసంస్థలు లేకపోవడమే కారణమని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడే మన దేశంలో చదువుకోవచ్చు కదా అని తన కుమార్తెను అడిగితే.. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయినట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి అని తన కుమార్తె అడుగుతోందని.. ఆమెకు ఇంకేం చెప్పాలి.. అది కూడా వాస్తవమే కదా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.మన దేశంలో అన్ని వనరులు, మానవ వనరులు ఉన్నప్పటికీ మన పిల్లలు ఉన్నత విద్య కోసం అమెరికా, ఇతర దేశాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. అత్యుత్తమ విద్యాసంస్థలను దేశంలోనే ఏర్పాటు చేసి యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటే విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.దేశంలో అభివృద్ధికి బదులుగా మతం, ఆహారం, దుస్తులు, కులం, ఎవరి దేవుడు గొప్ప అనే అంశాల చుట్టూ చర్చలు సాగుతున్నాయని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తి అయిన తర్వాత కూడా కుల, మతాల పేరుతో పంచాయతీలు కొనసాగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేశం విద్య, ఉపాధి
Actor ProfilePolitician
మన దేశంలో గొప్ప కాలేజీలు లేవని.. నా బిడ్డ అమెరికాలో చదువుతోంది.. కేటీఆర్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•26 Dec 2026
మన దేశంలో గొప్ప కాలేజీలు లేవని.. నా బిడ్డ అమెరికాలో చదువుతోంది.. కేటీఆర్ కామెంట్స్ వైరల్