మన జాతీయ జెండా సైజు ఎంత ఉండాలో తెలుసా
Actor ProfilePolitician

మన జాతీయ జెండా సైజు ఎంత ఉండాలో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మన జాతీయ జెండా సైజు ఎంత ఉండాలో తెలుసా
Asianet News Telugu28 Nov 2026
మన జాతీయ జెండా సైజు ఎంత ఉండాలో తెలుసా

భారత జాతీయ జెండాను మనం చాలా సైజుల్లో చూస్తుంటాం. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున పెద్ద స్తంభంపై రెపరెపలాడే భారీ సైజులోని జెండా నుండి టేబుల్‌పై పెట్టుకునే చిన్న జెండా వరకు ఎన్నో సైజుల్లో ఉంటాయి… కానీ వీటన్నింటిలోనూ మారని ఒకే ఒక్క విషయం దాని ఆకారం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. దాని పొడవు, వెడల్పుల నిష్పత్తి ఎల్లప్పుడూ 3:2 ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే జెండా పొడవును మూడు సమాన భాగాలుగా విభజిస్తే వెడల్పు కచ్చితంగా ఆ రెండు భాగాలంత ఉండాలి. అంటే జెండాను పెద్దగా లేదా చిన్నగా తయారు చేయొచ్చు… కానీ దాని కొలతల నిష్పత్తిని మాత్రం మార్చకూడదు. జాతీయ జెండా 3:2 నిష్పత్తిని అర్థం చేసుకోవడం చాలా సులభం. ఒకవేళ జెండా పొడవు 3 మీటర్లు ఉంటే దాని వెడల్పు 2 మీటర్లు ఉండాలి. పొడవు 6 మీటర్లు అయితే వెడల్పు 4 మీటర్లు ఉండాలి. ఇదే నియమం చిన్న కొలతలకు కూడా వర్తిస్తుంది. 900 మి.మీ పొడవున్న జెండా 600 మి.మీ వెడల్పు ఉండాలి. అలాగే 1,800 మి.మీ పొడవున్న జెండా 1,200 మి.మీ వెడల్పు ఉండాలి. ఇలా అసలు సైజు మారొచ్చు కానీ, పొడవు-వెడల్పుల మధ్య సంబంధం మాత్రం మారకూడదన్నది ఇక్కడ ముఖ్యం. జెండా ఏ సైజులోనైనా ఉండొచ్చు కానీ దాని పొడవు-వెడల్పుల నిష్పత్తి 3:2గా ఉండాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెబుతోంది. భారత జెండా దీర్ఘచతురస్రాకారంలో ఎందుకు ఉంటుంది? మన మువ్వన్నెల జెండాలో సమాన వెడల్పుతో మూడు దీర్ఘచతురస్రాకార ప్యానెళ్లు ఉంటాయి. పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉంటాయి. తెలుపు ప్యానెల్ మధ్యలో నేవీ బ్లూ రంగులో అశోక చక్రం ఉంటుంది. దీనికి 24 ఆకులు సమాన దూరంలో ఉంటాయి. ఈ చక్రం జెండాకు రెండు వైపులా