
కొండచరియల్లా విరిగిపడటంతో వయనాడ్‌లో ముగ్గురి దుర్మరణం 10 మందికి గాయాలు.. మరో ఐదుగురి గల్లంతు కేరళలోని వయనాడ్‌లో మెప్పడి టన్నెల్ ప్రాజెక్టు కల్లాడీ వద్ద మట్టిదిబ్బ కరిగి దూసుకొచ్చిన బురద ప్రవాహ ఉద్ధృతికి రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ ట్యాంకర్ రహదారికి అడ్డంగా తిరిగిపోయింది. రోడ్డుపై ఉన్న పలువురు బురదలో చిక్కుకుపోయారు. వయనాడ్: గుత్తేదారు నిర్లక్ష్యం.. భారీ వర్షం.. రెండూ తోడవడంతో కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ మట్టిదిబ్బ రుద్రరూపం దాల్చింది. ఉద్ధృత వరదలా దూసుకొచ్చి ముగ్గురి ప్రాణాలను కబళించింది. స్థానిక కల్లాడీ ప్రాంతంలోని మీనాక్షీ వంతెన సమీపంలో.. కోళికోడ్, వయనాడ్ జిల్లాలను అనుసంధానించే సొరంగ రోడ్డు (అనాక్కమపాయిల్-కల్లాడీ-మెప్పడీ) పనులు జరుగుతున్న చోట మంగళవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 10 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. మీనాక్షీ వంతెన సమీపంలో సొరంగ పనుల కోసం కొన్నాళ్లుగా భారీగా మట్టిని తవ్వి కుప్ప పోశారు. 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండలాంటి ఆ మట్టి దిబ్బ.. మంగళవారం ఉదయం దాదాపు 11 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. కొండచరియలు విరిగిపడ్డ తరహాలో.. ఒక్కసారిగా ప్రవాహంలా బురద దూసుకొచ్చింది. దాని ధాటికి చెట్లు కూలాయి. బారికేడ్లు ఎగిరిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ముగ్గురు మరణించారు. మృతులను మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌లకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. వయనాడ్‌లో 2024 జులైలో కొండచరియలు విరిగిపడి సుమారు 250 మంది ప్రాణాలు కోల్పోయిన ముండాక్కయీ-చూరాల్మలా గ్రామాలకు సమీపంలోనే ప్రస్తుత దుర్ఘటన చోటుచేసుకుంది. వయనాడ్ దుర్ఘటనకు సంబంధించిన ఓ భయానక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారీ మట్టి కుప్ప ఒక్కసారిగా కిందకు జారిపడుతుండగా, అక్కడున్నవారు ప్రాణ భయంతో హాహాకారాలు చేస్తూ పరుగులు తీయడం అందులో కనిపించింది. ‘‘వేగంగా పరుగెత్తండి.. ప్రాణాలు కాపాడుకోండి’’ అంటూ ఓ వ్యక్తి హెచ్చరించడం వినిపించింది. మరోవైపు- 24 గంటల వ్యవధిలో వయనాడ్‌లో 265 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వయనాడ్ విషాదంపై