మక్కా ఒప్పందం’లోకి ఈజిప్ట్
Actor ProfilePolitician

మక్కా ఒప్పందం’లోకి ఈజిప్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మక్కా ఒప్పందం’లోకి ఈజిప్ట్
Eenadu19 Nov 2026
మక్కా ఒప్పందం’లోకి ఈజిప్ట్

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు ‘మక్కా సమష్టి రక్షణ ఒప్పందం’ (Defense Agreement) కుదుర్చుకున్నాయి. ఇందులో తాజాగా ఈజిప్ట్‌ (Egypt) కూడా చేరనున్నట్లు తుర్కియే విదేశాంగ మంత్రి వెల్లడించారు. అన్ని విషయాల్లో తమ భాగస్వామిగా ఉండే ఆ దేశం మక్కా ఒప్పందంలోనూ చేరుతుందని తెలిపారు. అయితే తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని.. తమను తాము బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనిపై సంతకం చేశామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ కూటమి మరింత విస్తరించే అవకాశం ఉందని.. భవిష్యత్తులో మరిన్ని దేశాలు తమతో చేతులు కలుపుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇది కీలక ముందడుగు అని తుర్కియే విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. నాటో తరహా రక్షణ ఒప్పందం (Defence Pact) చేసుకోవాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. ‘అరబ్‌ వసంతం’ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 ముస్లిం దేశాలు ఒక్కటవ్వాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది. 2015లో మరోసారి ఈ తరహా ప్రతిపాదనను ఈజిప్ట్‌ చేసినా.. సార్వభౌమాధికారం, ఇతరత్రా కారణాలతో ముందుకు సాగలేదు. ప్రస్తుతం గల్ఫ్‌ దేశాలపై దాడులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడికి ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు