
ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ములుగు, ఆగస్టు 13: జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. గ్రామంలో నర్సింహరావు అనే వ్యక్తి భార్యతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. వీరితో పాటు శేషు అనే వ్యక్తి కూడా అదే గుడిసెలో ఉంటున్నాడు. వీరంతా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే నర్సింహరావు భార్యతో శేషు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా వీరిద్దరూ కలిసి నర్సింహరావును మోసం చేస్తూ వారి సంబంధాన్ని కొనసాగించారు. చివరకు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న నరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శేషును గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్ రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు