
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Lengthi Movies: అవును తెలుగు, హిందీ సహా అన్ని ఇండస్ట్రీ వాళ్లు ఇపుడు ఎక్కువ నిడివితో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలాంటి సినిమాల్లో బిగువైన కథ, కథనాలు ఉంటేనే ప్రేక్షకులు ఆయా సినిమాలను చూస్తారు. నేల విడిచి 3 గంటలు సినిమా తెరకెక్కిస్తే చూస్తారనుకుంటే పొరపడినట్టే. సినిమాలో కథ ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయగలిగాలి. చూస్తున్నంత సేపు అరే అపుడే అయిపోయిందా అనిపించేలా ఉంటే ఆయా సినిమాలను నెత్తిన పెట్టుకొని హిట్ చేస్తున్నారు. తాజాగా యశ్ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’ సినిమా రన్ టైమ్ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సిక్’. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లో ఏకకాలంలో చిత్రీకరించింది. ఈ సినిమాను హిందీ, తెలుగు సహా మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఓ రకంగా యశ్‌కు ఇది లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. ఈ సినిమాతో హిట్ కొడితే మాత్రం యశ్ ను ఆపడం ఎవరి తరం కాదు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం సినిమా సెలెక్షన్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా యశ్ ‘టాక్సిక్’ సినిమా 3 గంటల 14 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతకు ముందు పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ 3