భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా పాదయాత్ర
Actor ProfilePolitician

భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా పాదయాత్ర

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా పాదయాత్ర
Eenadu21 Nov 2026
భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా పాదయాత్ర

బెంగుళూరు (చిత్రదుర్గం): బెంగుళూరు శివార్లలోని బిడదీ వద్ద తలపెట్టిన టౌన్‌షిప్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ఆదివారం భైరమంగళలో వందలాది మంది రైతులు, భాజపా, జేడీఎస్ కార్యకర్తలు 40 కి.మీ పాదయాత్రను ప్రారంభించారు. భైరమంగళలో గత 515 రోజులుగా రైతులు భూముల స్వాధీనానికి వ్యతిరేకంగా ధర్నా, ఆందోళన చేస్తున్నారు. రైతులకు మద్దతుగా జేడీఎస్, భాజపాలు జతకట్టాయి. రాష్ట్ర జేడీఎస్ యువ శాఖ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఈ పాదయాత్రకు నేతృత్వం వహిస్తున్నారు. ఆదివారం భైరమంగళలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి పాదయాత్రను ప్రారంభించారు. ఆదివారం భైరమంగళ నుంచి బయలుదేరిన పాదయాత్ర మంగళవారం బెంగుళూరుకు చేరుకోనుంది. అనంతరం స్వాతంత్య్ర ఉద్యానవనంలో నిర్వహించనున్న బహిరంగలో రైతులు, పలు పార్టీల నాయకులు పాల్గొననున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

భ మ ల స వ ధ న న క వ యత ర క గ ప దయ త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in