
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఓ.. హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఓ డీఎస్పీ, హోంగార్డు, రాజకీయ నేతతో పాటు 11 మంది బినామీలను గుర్తించారు. ఎవరు ఏ ఆస్తికి బినామీగా ఉన్నారనే వివరాలను ఏసీబీ అధికారులు ఇప్పటికే కోర్టుకు అందజేశారు. భీమ్‌రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న రెండు మెమొరీ కార్డుల్లోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. మరోవైపు భీమ్‌రెడ్డి, ఆయన భార్య ఫోన్లలో బినామీలకు సంబంధించిన అనేక వివరాలను గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు గుర్తించిన బినామీలకు నోటీసులిచ్చి, వారి పేరిట ఉన్న ఆస్తులు, రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరిగాయి? క్యాన్సిలేషన్ డీడ్స్ సంగతి ఏంటి? రిజిస్ట్రేషన్ సమయంలో డబ్బు లావాదేవీలు ఏయే బ్యాంకు ఖాతాల నుంచి జరిగాయి? అనే విషయాలను నిర్ధారించుకోవాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. భీమ్‌రెడ్డి, ఆయన భార్య డైరీల్లో.. తమకు ఎవరు డబ్బులు ఇవ్వాలి? తమ ఆస్తులు ఎవరి పేరిట ఉన్నాయి? ఆ విషయాలు ఎవరికి తెలుసు? అనే విషయాలను స్పష్టంగా రాసుకున్నారు. ఇదే ప్రస్తుతం బినామీల విచారణలో కీలకంగా మారనుందని తెలుస్తోంది. విష్ణువర్ధన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, సర్వేశ్వర్‌రెడ్డి, సురేశ్, కిట్టు, లక్ష్మణ్, మనోజ్, లడ్డు, సరితలు భీమ్‌రెడ్డికిబినామీలుగా ఉన్నారని, మరో 14 మందిపై అనుమానాలు ఉన్నాయని, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా డీఎస్పీ శ్రీనాథ్‌రెడ్డికి ఒక ప్లాట్ విషయంలో అంతా తెలుసు అని మాత్రమే భీమ్‌రెడ్డి భార్య నోట్‌లో పేర్కొన్నారని, హోంగార్డు లక్ష్మణ్ పేరిట భారీగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మణికొండలోని మర్రిచెట్టు జంక్షన్‌లో నిర్మాణంలో ఉన్న రెండు వాణిజ్య భవనాలకు సంబంధించి దొరికిన ఆధారాలపై ఇంకా లోతుగా విచారణ