భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ.. నేటి అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు
Actor ProfilePolitician

భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ.. నేటి అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ.. నేటి అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు
AP7AM30 Dec 2026
భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ.. నేటి అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనితో పాటు, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని (ఐఎన్ఎస్ డేగా) సివిల్ ఎన్‌క్లేవ్‌లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ అర్ధరాత్రి 12:01 గంటల నుంచి భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు తమ సేవలను విశాఖపట్నం నుంచి భోగాపురానికి మార్చాయి. తొలిరోజే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, తిరుపతి వంటి నగరాలకు 31 సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు ఉన్న 'VTZ' ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ కోడ్‌ను కూడా భోగాపురం విమానాశ్రయానికి బదిలీ చేశారు. అయితే, జాతీయ అత్యవసర పరిస్థితులు, భారత వైమానిక దళం, ఇతర రక్షణ దళాలు, పోలీసు, ప్రభుత్వ ప్రత్యేక వీఐపీ విమానాల రాకపోకలకు మాత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను వినియోగించనున్నారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఈ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ. 4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 31 నెలల్లోనే పూర్తయి, దేశంలో అత్యంత వేగంగా నిర్మించిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. షెడ్యూల్ కంటే దాదాపు ఐదు నెలల ముందే దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం. ఈ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే డీజీసీఏ ఏరోడ్రోమ్ లైసెన్స్‌తో పాటు అవసరమైన అన్ని భద్రత, అగ్నిమాపక, పర్యావరణ అనుమతులు