
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్, బందర్ అబ్బాస్, కొనారక్, ఇరాన్‌షహర్ సహా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ప్రకటనలో, హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని వెల్లడించింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్‌ను బాధ్యుడిగా నిలబెడుతున్నామని స్పష్టం చేసింది. హెచ్చరిక తర్వాతే దాడులు మంగళవారం హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు సరకు నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. "నిన్న నౌకలపై జరిగిన దాడికి ఇదే సమాధానం. మళ్లీ అలాంటి దాడులు జరిగితే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు. టర్కీలో జరిగిన నాటో సదస్సులో మాట్లాడుతూ, "ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు. మరింత తీవ్రంగా అమెరికా దాడులు రాయిటర్స్ కథనం ప్రకారం.. బుధవారం జరిగిన దాడులు మంగళవారం కంటే మరింత విస్తృతంగా సాగాయి. ఇరాన్ దక్షిణ తీరంలోని కీలక సైనిక, నౌకాదళ మౌలిక సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్న బందర్ అబ్బాస్, నౌకాదళ స్థావరాలు