భయంతో వణికి.. ఒక్కసారిగా కుప్పకూలి
Actor ProfilePolitician

భయంతో వణికి.. ఒక్కసారిగా కుప్పకూలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భయంతో వణికి.. ఒక్కసారిగా కుప్పకూలి
Eenadu24 Jan 2027
భయంతో వణికి.. ఒక్కసారిగా కుప్పకూలి

హోంవర్క్‌ చేయలేదని చిన్నారికి టీచర్‌ మందలింపు చొక్కా గుండీలు తీసి.. చెంపపై కొట్టిన ఉపాధ్యాయురాలు తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన ఆరేళ్ల బాలుడు విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన కేజీహెచ్‌ శవాగారం వద్ద రోదిస్తున్న బాలుడి తల్లిదండ్రులు ఈనాడు, విశాఖపట్నం, అమరావతి, న్యూస్‌టుడే-జగదాంబకూడలి: హోంవర్క్‌ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించడంతో.. తీవ్రంగా భయపడిన ఆరేళ్ల బాలుడి ఊపిరాగిపోయింది. టీచర్‌ కోప్పడతారన్న భయంతో ఆ చిన్నారి అప్పటికే గజగజలాడుతుండగా.. టీచర్‌ పలక లాక్కొని.. టై, బెల్టు తీసి, చొక్కా గుండీలు విప్పి, చెంపపై కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం.. విశాఖలోని టౌన్‌కొత్తరోడ్డుకు చెందిన తమ్మన కృష్ణప్రసాద్‌ క్యాటరింగ్‌ పనులు చేస్తుంటారు., ఆయనకు భార్య సాయిలక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు ప్రణయ్‌తేజ్‌ (6) టౌన్‌కొత్తరోడ్డులోని వారి ఇంటికి సమీపంలోని లిటిల్‌ గార్డెన్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. పాఠశాలలో గురువారం ఉదయం ఉపాధ్యాయురాలు పిల్లలకు ఇచ్చిన హోంవర్క్‌లను పరిశీలిస్తున్నారు. అప్పటికే ప్రణయ్‌తేజ్‌ తాను హోంవర్క్‌ చేయలేదన్న ఆందోళనలో ఉన్నాడు. ఇంతలో టీచర్‌ అడగడంతో భయపడుతూ వెళ్లగా, ఆమె పలక లాగేసుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయురాలు బాబును మందలించారు. దగ్గరకు రమ్మని పిలిచి కోప్పడ్డారు. దగ్గరకు లాగి.. టై, బెల్టు వదులు చేసి, చొక్కా గుండీలు విప్పి, చెంపపై కొట్టడంతో అక్కడికక్కడే ముందుకు వాలిపోతూ టీచర్‌ ఒడిలో కుప్పకూలిపోయాడు. ఆమె బాలుడిని నిలబెట్టే ప్రయత్నం చేసినా లేవలేదు. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది సహకారంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అక్కడి నుంచి పాఠశాల సిబ్బంది కేజీహెచ్‌కు తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి, బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. కేజీహెచ్‌లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని చూసి బోరున

భయ త వణ క ఒక కస ర గ క ప పక ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in