భయం కాదు క్యూటీ.. రష్మికను ఆటపట్టించిన విజయ్ దేవరకొండ
Actor ProfileActor

భయం కాదు క్యూటీ.. రష్మికను ఆటపట్టించిన విజయ్ దేవరకొండ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భయం కాదు క్యూటీ.. రష్మికను ఆటపట్టించిన విజయ్ దేవరకొండ
Zee Telugu6 Nov 2026
భయం కాదు క్యూటీ.. రష్మికను ఆటపట్టించిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda:విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'రణబాలి' సినిమా 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. తాజాగా రష్మిక చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్, దానికి విజయ్ ఇచ్చిన సరదా సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారాయి. రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రణబాలి సినిమా సెట్స్ నుంచి విజయ్ దేవరకొండ లుక్‌కు సంబంధించిన బ్లర్ ఫొటోను షేర్ చేసింది. ఫొటో పూర్తిగా కనిపించకపోయినా విజయ్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ, "ఇది ఇప్పుడు చూపించొచ్చో లేదో తెలియదు. తర్వాత తీసేయమని చెప్పినా ఆశ్చర్యం లేదు. కానీ విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కలిసి చాలా భయంకరమైనది సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఉంది" అని రాసింది. రష్మిక పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు కూడా విజయ్ కొత్త లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే రష్మిక పోస్ట్‌కు విజయ్ దేవరకొండ కూడా వెంటనే స్పందించాడు. ఆమె స్టోరీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ "క్యూటీ" అని ప్రేమగా పిలిచాడు. అలాగే రష్మిక చెప్పిన "స్కేరీ" అనే మాటను సరదాగా సరిదిద్దుతూ, "నాట్ స్కేరీ... డివైన్" అని రాశాడు. విజయ్ చేసిన ఈ కామెంట్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబాలి సినిమా బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన పోరాటాల నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడు రణబాలి పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక జయమ్మ పాత్రను పోషిస్తోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రాహుల్