భగీర మృతి.. బాధతో ఎన్టీఆర్ పోస్టు
Actor ProfileActor

భగీర మృతి.. బాధతో ఎన్టీఆర్ పోస్టు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భగీర మృతి.. బాధతో ఎన్టీఆర్ పోస్టు
Eenadu14 Jan 2027
భగీర మృతి.. బాధతో ఎన్టీఆర్ పోస్టు

ఇంటర్నెట్‌ డెస్క్: తన పెంపుడు కుక్క ‘భగీర’ మరణించిందంటూ ఎన్టీఆర్ (NTR) విచారం వ్యక్తం చేశారు. దానితో ఉన్న అనుబంధాన్ని ఇన్‌స్టా వేదికగా గుర్తు చేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘‘భగీర.. నువ్వు నా జీవితంలోకి పెంపుడు శునకంలా వచ్చావు. కొంత కాలంలోనే మా కుటుంబ సభ్యుడిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరితో ప్రతి రోజూ నా అలసటను దూరం చేశావు. ఇప్పుడు చెప్పలేని బాధను మిగిల్చి వెళ్లావు. నీ జ్ఞాపకాలు (bagheera) ఎప్పటికీ మాతో ఉంటాయి ’’అని రాసుకొచ్చారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 11న థియేటర్లలోకి రానుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

భగ ర మ త బ ధత ఎన ట ఆర ప స ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in