భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే
Actor ProfileActor

భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే
TV9 Telugu13 Dec 2026
భగ్గుమన్న బంగారం ధరలు.. గంటల్లోనే మారిన లెక్కలు.. ఇప్పుడు తులం ఎంతంటే

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో భారీ పెరుగుదల నమోదవుతోంది. అమెరికన్ డాలర్ విలువ పెరగడంతో పాటు 10 సంవత్సరాల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పాటు జూలైకి సంబంధించిన అమెరికా ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు గోల్డ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దేశంలో వివిధ నగరాల్లో ఆగస్ట్ 13న ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130 వద్ద కొనసాగుతుండగా.. నిన్నటితో పోలిస్తే రూ.270 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,42,200గా ఉండగా.. నేడు రూ.250 పెరుగుదల నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,130గా ఉండగా.. గురువారం రూ.220 మేర పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,200 వద్ద ట్రేడవుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.200 పెరిగాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130గా ఉండగా.. 22 క్యారెట్లు రూ.1,42,200 పలుకుతోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,55,280 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,42,350 పలుకుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్దిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.55 లక్షలు పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద ఉంది. అటు ఉదయం 9:10 గంటల ప్రాంతంలో మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ 0.05 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,54,960 వద్ద ఉండగా.. MCX సిల్వర్ సెప్టెంబర్ కాంట్రాక్టులు 0.16 శాతం తగ్గి కిలోకు రూ.2,37,450 వద్ద ఉన్నాయి