బ్లాస్ట్ ’ దర్శకుడితో.. చియాన్ విక్రమ్
Actor ProfileActor

బ్లాస్ట్ ’ దర్శకుడితో.. చియాన్ విక్రమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బ్లాస్ట్ ’ దర్శకుడితో.. చియాన్ విక్రమ్
Chitrajyothy2 Oct 2026
బ్లాస్ట్ ’ దర్శకుడితో.. చియాన్ విక్రమ్

ఇటీవ‌ల అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుంద‌న్ కాంబోలో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం బ్లాస్ట్. ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ మూవీ రికార్డులు నెల‌కొల్పింది. ఇటీవ‌ల అర్జున్ (Arjun), అభిరామి (Abhirami), ప్రీతీ ముకుంద‌న్ (Preity Mukhundhan) కాంబోలో తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం బ్లాస్ట్ (Blast Movie). ఎలాంటి అంచ‌నాలు లేకుండా థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ మూవీ రికార్డులు నెల‌కొల్పింది. కాగా.. ఈ మూవీని రూపొందించిన ద‌ర్శ‌కుడు సుభాష్‌ కె.రాజన్ (Subhash K Rajan) ఇప్పుడు బంఫ‌రాఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మిళ స్టార్స్‌లో ఒక‌రైన చియాన్‌ విక్రమ్ (Chiyaan Vikram)ను డైరెక్ట్‌ చేయనున్నట్టు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. సుభాష్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ యంగ్‌ దర్శకుడితో కలిసి పనిచేసేందుకు విక్రమ్‌ సమ్మతం తెలిపినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మించనుంది. కాగా, సుభాష్‌ కె.రాజన్‌ సామాజిక సందేశంతో ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన బ్లాస్ట్ మూవీ విజయం తర్వాత దర్శకుడు సుభాష్‌తో కలిసి పనిచేసేందుకు పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సుభాష్‌ చెప్పిన కథ నచ్చడంతో చియాన్‌ విక్రమ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మించనుంది

బ ల స ట దర శక డ త చ య న వ క రమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in