బాల్యం చేతిలో బ్లడ్
Actor ProfilePolitician

బాల్యం చేతిలో బ్లడ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
బాల్యం చేతిలో బ్లడ్
Andhra Jyothy18 Jan 2027
బాల్యం చేతిలో బ్లడ్

పాఠశాల విద్యార్థుల్లో పెరుగుతున్న నేర ప్రవత్తి.. రాష్ట్రంలో పెరుగుతున్న నేరారోపిత బాలల సంఖ్య తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం.. డ్రగ్స్‌, మద్యం, సోషల్‌ మీడియాతో ప్రభావం దేశంలో 9వ స్థానంలో తెలంగాణ.. పిల్లలను గమనించాలి.. సమస్యలు తెలుసుకోవాలి: నిపుణులు హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా పొడిచి చంపేశారు.. కూకట్‌పల్లిలో కొందరు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని పాఠశాలలోనే కొట్టి చంపారు.. నిజామాబాద్‌లో హైస్కూల్‌ విద్యార్థులు తమ సహచర విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా బయటికి వచ్చింది... ఇలా చెప్పుకొంటూ వెళితే ఎన్నో. పాఠశాల అంటే పుస్తకాలు, పాఠాలు, ఆటలు, స్నేహాలు, భవిష్యత్తు కలలతో నిండిన ప్రదేశం. కానీ కొంతకాలం నుంచి బడి ఈడు పిల్లల చేతులు రక్తంతో తడుస్తున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌమార దశలోని విద్యార్థుల్లో క్రూరమైన నేర ప్రవృత్తిపై చర్చ జరుగుతోంది. డ్రగ్స్‌, మద్యం... ఫోన్‌లో కళ్లముందు హింస.. విద్యార్థుల్లో మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వినియోగం పెరగడం వారిలో నేరప్రవృత్తిని నాటుతున్నాయని.. అవి పిల్లల నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో, ఓటీటీల్లో హింసాత్మక వీడియోలు, గ్యాంగ్‌ కల్చర్‌, సైబర్‌ బుల్లీయింగ్‌ వంటివి నేరప్రవృత్తి పెరిగేందుకు దారితీస్తున్నాయి. హింసను వినోదంగా చూపించే కంటెంట్‌, దూకుడు ప్రవర్తనను హీరోయిజంగా చూపించే సంస్కృతి, అశ్లీల వీడియోలు పిల్లల్లో ఆ తరహా మనస్తత్వాన్ని పెంచుతున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎక్కువే! ఇటీవల రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ‘‘మీరు ఏం చేస్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు?’ అని దాదాపు 5వేల మంది విద్యార్థులను ప్రశ్నించగా.. 96శాతం విద్యార్థులు చెప్పిన సమాధానం ఒక్కటే. మంచి మార్కులొస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారని.. మార్కులు తప్ప మరే

బ ల య చ త ల బ లడ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in